Thursday, May 16, 2024

అంతటా ఇదే ముచ్చట.. నగరంలో రోడ్లన్నీ నిర్మానుష్యం..!

పాక్షిక సూర్యగ్రహణం పట్టబోతుంది.. ఎక్కడ చూసిన అంతటా ఇదే చర్చ.. ఎలా ఉండాలి..? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? గ్రహణం సమయంలో సూర్య రష్మి మనపై పడితే ఏమైన కీడు జరుగుతుందా? ఇలా అందరి మదిలో ఎన్నో ప్రశ్నలు మెదులుతున్నాయి. వామ్మో ఇదంతా మనకెందుకు వచ్చిన లొళ్లి అంటూ జనం ఇళ్ల నుంచి బయటకు వెళ్లేందుకు జంకుతున్నారు. హైదరాబాద్‌ మహానగరంలో ఎప్పుడు రద్దీగా ఉండే ప్రాంతాలు కాస్త సూర్యగ్రహనం ప్రభావంతో దాదాపు ప్రధాన కూడళ్లు కూడా నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. జూబ్లిహీల్స్‌, బంజారాహీల్స్‌, అమీర్‌పేట, సికింద్రాబాద్‌, ఉప్పల్‌, ఎల్బీనగర్‌ ఇలా ఎప్పుడు రద్దీగా ఉండే ప్రాంతాలు సైతం సూర్యగ్రహనం ప్రభావంతో రోడ్డు కాళీగా కనిపిస్తున్నాయి. 4.00 వరకు ఎలాగైనా ఇంట్లో ఉండాలి.. బయటకు వెళ్లొద్దని అందరూ ముందుగానే ప్లాన్‌ చేసుకుంటున్నారు. కొందరైతే సమయానికంటే ముందే కార్యాలయాలకు చేరుకుంటున్నారు. కొందరు తమ రాశిని బట్టి పలు పూజలు చేసుకుంటుండగా.. గర్భిణులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మొత్తం మీద ఇప్పుడు సూర్యగ్రహణం హాట్‌ టాపిక్‌గా మారిందని చెప్పవచ్చు..

మన వద్ద సుమారు గంటసేపు..
ప్రపంచ వ్యాప్తంగా చూస్తే.. సూర్య గ్రహణం మధ్యాహ్నం 2.28 గంటలకు మొదలై సాయంత్రం 6.32 గంటల వరకు కొనసాగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో సూర్యాస్తమయ సమయంలో సాయంత్రం 4.59 నుంచి ప్రారంభమై 5.48 గంటల వరకు కొనసాగనుంది. దాదాపు గంటసేపు ఉండే సూర్యగ్రహణాన్ని ప్రత్యేక ఫిల్టర్లతోనే చూడాల్సి ఉంటు-ంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement