Monday, April 29, 2024

రామ్ పోతినేని బర్త్ డేకి “ఇస్మార్ట్” అప్డేట్..

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరో.. ప్రస్తుతం బోయపాటితో భారీ మాస్ యాక్షన్ డ్రామా మూవీ చేస్తున్నాడు. ఇక 2019లో పూరి జగన్నాథ్ రామ్ పోతినేని కాంబినేషన్ నుంచి వచ్చిన మూవీ “ఇస్మార్ట్ శంకర్”. ఈ మూవీ పెద్ద సెన్సేషన్ కాగా ఈ సినిమా తర్వాత మళ్ళీ ఈ క్రేజీ కాంబినేషన్ రీపీట్ కానుంది. దీనికి సంబంధించి లేటెస్ట్ గా కన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు మేకర్స్. వీరి కాంబినేషన్ లో రానున్న సినిమా పై ఇవ్వాల సాలిడ్ అప్డేట్ అందించారు. ఇస్మార్ట్ శంకర్ 2 ని అంతా ఆశిస్తూ ఉండగా ఇప్పుడు దీనికి సీక్వెల్ ని కన్ఫర్మ్ చేస్తూ అనౌన్స్ చేసేసారు మేకర్స్.

ఈ సీక్వెల్ ఎనౌన్స్ మెంట్ ఒక ఎత్తు అయితే.. ఈ మూవీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేయడం మరో బిగ్ అప్డేట్ అనే చెప్పాలి. ఇక ఈ మూవీని వచ్చే ఏడాది మార్చ్ 8న పాన్ ఇండియా వైడ్ థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నట్టు కన్ఫర్మ్ చేసేసారు. మొత్తానికి అయితే రేపు రామ్ బర్త్ డే కానుకగా ఫ్యాన్స్ కి కావాల్సిన ఎనర్జిటిక్ బూస్ట్ ని సినిమా మేకర్స్ ఇచ్చేసారు అని చెప్పాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement