Friday, May 3, 2024

వ‌క్ఫ్ బోర్డు నియామ‌కాల్లో అవ‌క‌త‌వ‌క‌లు.. ఆప్‌ ఎమ్మెల్యేకు నాలుగు రోజుల కస్టడీ

వక్ఫ్‌బోర్డు నియామకాల అవకతవకలపై ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అమానాతుల్లాఖాన్‌ను నాలుగు రోజుల పోలీసు కస్టడీకి తరలించారు. 14 రోజుల కస్టడీ కోరుతూ డిల్లి రోజ్‌ అవెన్యూ కోర్టును ఏసీబీ అభ్యర్థించింది. ఇరువర్గాల వాదనలు విన్నతర్వాత నాలుగు రోజుల కస్టడీకి కోర్టు అనుమతించింది. శుక్రవారం ఆయన నివాసాలు, కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు చేపట్టింది. ఎమ్మెల్యే సన్నిహితులపైనా దాడులు నిర్వహించింది.

ఈ క్రమంలో సోమవారం ఆయన్ను అరెస్టు చేసింది. ఈ తనిఖీల్లో బెరెట్టా ఆయుధంతోపాటు, కొన్ని క్యాట్రిడ్జ్‌లు, రూ.12 లక్షల నగదును జప్తుచేసింది. అమానాతుల్లా ఖాన్‌ సన్నిహితుడైన కౌసర్‌ సిద్ధిఖి నివాసంలో వీటిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. దీనిపై శనివారం ఉదయం ఢిల్లి సీఎం కేజ్రీవాల్‌ స్పందిస్తూ, బీజేపీని నిందించారు. గుజరాత్‌లో ఆ పార్టీకి తీవ్రనష్టం జరుగుతున్నందున, ఆప్‌పై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement