Thursday, May 16, 2024

ఐపీఎల్ ప్లేఆఫ్ షెడ్యూల్ రిలీజ్.. వివరాలు ఇవే !

ఈ ఏడాది ఐపీఎల్ (2023) సీజన్ ప్లేఆఫ్స్ మ్యాచ్‌ల షెడ్యూల్ ఇవ్వాల (శుక్రవారం) రిలీజ్ అయింది. మార్చి 31 నుంచి ఐపీఎల్ 2023 మ్యాచ్‌లు ప్రారంభం అయ్యాయి.. కాగా, సీజన్ లో ఉన్న 10 జట్లు కలిపి మొత్తం 70 మ్యాచ్‌లు ఆడతాయి. ఈ మ్యాచ్‌లు మే 21న ముగియనున్నాయి. ఆ తర్వాత ఒక్క రోజు గ్యాప్‌తో.. మే 23 నుంచి ప్లేఆఫ్స్ మ్యాచ్‌లు ప్రారంభంకానున్నాయి. లీగ్ దశ మ్యాచ్‌లు ముగిసే సమయానికి పాయింట్ల పట్టికలో టాప్-4లో నిలిచిన జట్లు ప్లేఆఫ్స్‌కి అర్హత సాధిస్తాయి.

పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య మే 23న చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా క్వాలిఫయర్-1 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కి చేరుకుంటుంది. ఓడిన టీమ్‌కి క్వాలిఫయర్ -2లో ఆడే చాన్స్ దొరుకుతుంది. ఇక, పాయింట్స్ టెబుల్ లో 3, 4 స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య మే 24న చెపాక్‌లోనే ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది.

ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఓడిన టీమ్ టోర్నీ నుంచి నిష్క్రమించనుంది. అలానే గెలిచిన టీమ్ క్వాలిఫయర్ -1లో ఓడిన జట్టుతో మే 26న అహ్మదాబాద్ వేదికగా క్వాలిఫయర్-2లో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్‌కి.. ఓడిన టీమ్ ఇంటికి వెళ్లనుంది. ఆఖరిగా మే 28న క్వాలిఫయర్-1 మ్యాచ్ విజేత, క్వాలిఫయర్-2 మ్యాచ్ విజేత మధ్య ఫైనల్ పోరు అహ్మదాబాద్‌లో జరగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement