Wednesday, May 15, 2024

కామన్‌వెల్త్‌ గేమ్స్‌ తర్వాతే ఐవోఏ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఏర్పాటు: రాజీవ్‌ మెహతా

ఇండియన్‌ ఒలంపిక్‌ గేమ్స్‌ అసోసియేషన్‌ కమిటీ ఎన్నికలు ప్రస్తుతానికి వాయిదా వేయాలని ఇంటర్నేషన్‌ ఒలంపిక్‌ కమిటీ కోరినట్లు జనరల్‌ సెక్రటరీ రాజీవ్‌ మెహతా తెలిపారు. బర్మింగ్‌హమ్‌ వేదికగా జరుగనున్న వేదికగా జులై 28 నుంచి జరుగనున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ అనేది గేమ్స్‌పై ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. గేమ్స్‌ మొదలవుతున్న తరుణంలో అధికారులు మొత్తం బర్మింగ్‌హమ్‌లో ఉండటం వల్ల ఎన్నికలు సాధ్యం కాదని .. గేమ్స్‌ తర్వాత నిర్వహిస్తే మంచిదని తెలిపారు.

ఇదిలా ఉండగా ఇండియన్‌ ఒలంపిక్‌ కమిటీని సాధ్యమైనంత త్వరగా నియమించుకోవాలని అంతర్జాతీయ ఒలంపిక్‌ కమిటీ సూచించింది. గత డిసెంబర్‌లోనే జరగాల్సిన ఎన్నికల నిర్వహణపై ఢిల్లి హైకోర్టులో కేసు నడుస్తున్న కారణంగా .. కోర్టు నుంచి ఆర్డర్స్‌ కూడా రావాల్సి ఉందని.. అంతకు ముందే నిర్వహించేందుకు కోర్టు అనుమతి కావాల్సి వస్తుందని తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement