Thursday, May 23, 2024

ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల దరఖాస్తులకు ఆహ్వానం..

వికారాబాద్‌, (ప్రభ న్యూస్‌): వికారాబాద్‌, మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లాలలో అవుట్‌ సోర్సింగ్‌ పద్దతిలో ఇంగ్లీష్‌ మీడియంలో బోధించుటకు టీజిటి,పిజిటి, జూనియర్‌ లెక్చరర్ల అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు వినాయక అవుట్‌ సోర్సింగ్‌ ఏజన్సీ ఓ ప్రకటనలో తెలిపింది.

15 జులై లోపు సంబందిత అభ్యర్థులు దరఖాస్తుఫారంతోపాటు సంబందిత సర్టిఫికెట్ల్‌ జిరాక్స్‌లను జత చేసి వినాయక అవుట్‌ సోర్సింగ్‌ ఏజన్సీ ఉప్పల్‌ క్రాస్‌ రోడ్‌ హైదరాబాద్‌లో సమర్పించాలని అన్నారు. సంబందిత ఎంపికైన అభ్యర్థులు సంవత్సరం పాటు పనిచేస్తామని హామి ఇస్తు లిఖిత పూర్వకంగా అందజేయాలని అన్నారు. ఇతర వివరాల కోసం 8341 852618,7989109808,7416553834 నంబర్లను సంప్రదించాలని అన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement