Tuesday, May 7, 2024

ఇంటెలిజెన్స్‌ హెచ్చరికలు, బండికి బుల్లెట్‌ ప్రూఫ్‌ కారు..

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు బుల్లెట్‌ ప్రూఫ్‌ కారు రానుంది. కొత్త బుల్లెట్‌ ప్రూఫ్‌ కారు కొనుగోలుకు కేంద్రపార్టీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. బీజేపీ రాష్ట్ర కా ర్యాలయం, సంజయ్‌ భద్రత విషయంలో గత కొంత కాలంగా ఇంటెలిజెన్స్‌ వర్గాలు పలు హెచ్చరికలు చేస్తున్నాయి. భద్రత కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు పార్టీ రాష్ట్ర కార్యాలయానికి ఏర్పాటు చేయాల్సిన రక్షణ కవచాలపై సూచనలు కూడా సూచించారు. ఎంపీగా కూడా ఉన్న సంజయ్‌కు బుల్లెట్‌ప్రూఫ్‌ వాహనాన్ని సమకూర్చేందుకు సిద్దమైన ఇంటెలిజెన్స్‌ వర్గాలు ఒక వాహనాన్ని సమకూర్చాలని నిర్ణయించారు.

కొత్త బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనం అందుబాటులో లేకపోవడంతో పాత వాహనాన్ని కేటాయి స్తామని చెప్పారు. దీంతో ప్రయాణాలలో ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయన్న అభిప్రాయంతో సంజయ్‌ కొత్త వాహనం ఇవ్వాలని కోరినప్పటికీ ఇంటెలిజెన్స్‌ అధికారులు నిస్సహాయత వ్యక్తం చేశారు. ఇటీవల ఢిల్లికి వెళ్ళిన సంజయ్‌ రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ అధికారుల హెచ్చరికలకు సంబంధించిన వివరాలను పార్టీ అధినాయకత్వానికి తెలియజేశారు. పార్టీ తరఫున కొత్త వాహనం కొనుగోలుకు అనుమతించాలని కోరారు. సంజయ్‌ సూచనకు అధిష్టానం ఓకే చెప్పినట్లు సమాచారం. రాష్ట్ర పార్టీ తరఫున రూ. 2 కోట్ల విలువ చేసే టయోటా ఫార్చ్యూనర్‌ బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాన్ని కొనుగోలు చేయాలని నిర్ణయించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement