Friday, April 26, 2024

వరంగల్‌ ఓఆర్‌ఆర్‌ పనులకు బ్రేకే, పూలింగ్‌ నిర్ణయం వెనక్కి.. మంత్రి కేటీఆర్‌ ఆదేశంతో ఉత్తర్వులు రద్దు..

హైదరాబాద్‌ ఆంధ్రప్రభ బ్యూరో : వరంగల్‌ పట్టణానికి చుట్టూ బాహ్య వలయ రహదారి (ఔటర్‌ రింగ్‌ రోడ్‌ )నిర్మాణానికి అవసరమైన భూమిని ల్యాండ్‌ పూలింగ్‌ ద్వారా సేకరించాలని గతంలో తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ల్యాండ్‌ పూలింగ్‌ ద్వారా భూములను సేకరించాలని కోరుతూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ వరంగల్‌ పరిసర గ్రామాల ప్రజలు గత కొంత కాలంగా పెద్ద ఎత్తున ఆందోళనలను నిర్వహస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌ సోమవారం పరిశ్రమలు మునిసిపల్‌ శాఖ మంత్రి కేటీ రామారావు దృష్టికి తీసుకెళ్లి జరుగుతున్న పరిణామాలను వివరించగా స్పందించిన మంత్రి గతంలో ఔటర్‌ రింగ్‌ రోడ్‌ నిర్మాణానికి అవసరమైన భూములను ల్యాండ్‌ పూలింగ్‌ ద్వారా సేకరించాలని ఇచ్చిన ఆదేశాలను నిలుపుదల చేయాలని మునిసిపల్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌ను కోరారు. వెంటనే అయన ల్యాండ్‌ పూలింగ్‌ను రద్దు చేస్తూ ఆదేశాలు జారీచేశారు. వరంగల్‌ ఔటర్‌ రింగ్‌రోడ్డు కోసం ప్రతిపాదించిన ల్యాండ్‌ పూలింగ్‌ (భూ సమీకరణ) నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

నోటిఫికేషన్‌ సైతం ఉపసంహరించుకోవాలని కాకతీయ పట్టణాభివద్ధి సంస్థ(కుడా) వైస్‌ ఛైర్‌పర్సన్‌కు ఆదేశాలు జారీ చేసింది. వరంగల్‌, హనుమకొండ, జనగామ జిల్లాల్లో 27 గ్రామాల పరిధిలో 22 వేల ఎకరాల మేర భూసమీకరణ చేపట్టేందుకు ‘కుడా’ ఇటీవల నోటిఫికేషన్‌ ఇచ్చింది. దీంతో ఆయా గ్రామాల రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. భూసమీకరణకు తాము ఒప్పుకోమని రైతులంతా ఆందోళన బాట పట్టారు. వ్యతిరేకత వస్తుండడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వరంగల్‌ ఔటర్‌ రింగ్‌రోడ్డు కోసం ప్రతిపాదించిన ల్యాండ్‌ పూలింగ్‌ (భూ సమీకరణ) నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నోటిఫికేషన్‌ సైతం ఉపసం#హరించుకోవాలని కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ(కుడా) వైస్‌ ఛైర్‌పర్సన్‌ కు ఆదేశాలు జారీ చేసింది. వరంగల్‌, హనుమకొండ, జనగామ జిల్లాల్లో 27 గ్రామాల పరిధిలో 22 వేల ఎకరాల మేర భూసమీకరణ చేపట్టేందుకు ‘కుడా’ ఇటీవల నోటిఫికేషన్‌ ఇచ్చింది. దీంతో ఆయా గ్రామాల రైతులు పెద్ద ఎత్తున ఆందొళన లకు దిగారు. భూసమీకరణకు తాము ఒప్పుకోమని రైతులంతా ఆందోళన బాట పట్టారు. వ్యతి రేకత వస్తుండడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement