Wednesday, October 16, 2024

Inner Ring Road Case – అక్టోబ‌ర్ 4వ తేదిన విచార‌ణ‌… నారా లోకేశ్‌కు సీఐడీ నోటీసులు …

న్యూ ఢిల్లీ : ఇన్నర్‌రింగ్‌ రోడ్డు కేసులో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. అక్టోబరు 4న ఉదయం 10గంటలకు సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని 41ఏ నోటీసు లో పేర్కొన్నారు.. ఈ కేసులో నారా లోకేష్ ఎ 14గా ఉన్నారు. ఇది ఇలాఉంటే గ‌త మూడు వారాలుగా ఢిల్లీలోనే ఉంటున్న‌నారా లోకేష్ తాత్కాలికంగా ఆ పార్టీ ఎంపి గ‌ల్లా జ‌య‌దేవ్ నివాసాన్ని వినియోగించుకుంటున్నారు.. దీంతో సిఐడి అధికారులు నేరుగా గ‌ల్లా నివాసానికి వెళ్లి నారాలోకేష్ కు స్వ‌యంగా నోటీస్ అంద‌జేశారు.. అలాగే అయ‌న వాట్స్ ప్ కూడా నోటీస్ కాపీని పంపారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement