Sunday, April 28, 2024

వాయిసేన అగ్నివీర్ ప‌రీక్షా ఫ‌లితాలు విడుద‌ల ..

ఢిల్లీ: భారత వాయుసేన లో అగ్నివీరుల నియామకాల కోసం నిర్వహించిన పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్ వాయు పోస్టుల భర్తీకి మే 20 నుంచి రాత పరీక్షలు నిర్వహించింది.. ఈ ఫలితాలను అధికారులు తాజాగా విడుదల చేశారు.

అభ్యర్థులు తమ ఈ-మెయిల్ ఐడీ, పాస్‌వర్డ్‌, క్యాప్చా కోడ్‌లను ఎంటర్‌చేయడం ద్వారా ఫలితాలను పొందొచ్చు అని ప‌రీక్ష‌ల నిర్వ‌హణ క‌న్వీన‌ర్ వెల్ల‌డించారు. ఫేజ్-1 కింద నిర్వహించిన ఆన్‌లైన్ రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను ఫేజ్-2 (ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, అడాప్టబిలిటీ టెస్ట్-1, అడాప్టబిలిటీ టెస్ట్-2), ఫేజ్-3(మెడికల్ ఫిట్‌నెస్ టెస్ట్), ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక పూర్తి చేయనున్న‌ట్లు పేర్కొన్నారు..

- Advertisement -

ఫలితాల కోసం ….. agnipathvayu.cdac.in వెబ్ సైట్ లో చూడండి

Advertisement

తాజా వార్తలు

Advertisement