Sunday, May 5, 2024

షార్ట్‌గన్‌లో భారత్‌ రికార్డు.. గణేమత్‌కు రజతం, దర్శనకు కాంస్యం

కజకిస్తాన్‌లో జరిగిన ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచకప్‌ మహిళల స్కీట్‌లో భారత్‌ తొలిసారి సీనియర్‌ విభాగంలో రెండు వ్యక్తిగత పతకాలు సాధించింది. గణేమత్‌ సెఖోస్‌ రజతం సాధించగా, దర్శన రాథోడ్‌ కాంస్యంతో మెరిసింది. భారత షూటర్లిద్దరూ 60 షాట్‌ల ఫైనల్‌లో 50 హిట్‌లతో ముగించిన తర్వాత, షూట్‌ ఆఫ్‌ ద్వారా కజకిస్తాన్‌కు చెందిన స్థానిక అస్పేమ్‌ ఓరిన్‌బే స్వర్ణం నెగ్గింది. మొదటి రెండు షూట్‌ఆఫ్‌ లక్ష్యాలలో ఒకదానిని కోల్పోయిన గణేమత్‌ రజతంతో సరిపెట్టుకుంది.

కాగా ఇది గణేమత్‌కు రెండవ వ్యక్తిగత ప్రపంచకప్‌ పతకం. దర్శనకు ఇది తొలి పతకం. పురుషుల స్కీట్‌లో పాల్గొన్న ముగ్గురు భారతీయుల్లో ఏ ఒక్కరూ ఫైనల్‌కి చేరుకోలేదు. మైరాజ్‌ఖాన్‌ బెస్ట్‌ ఫినిషర్‌గా 119 పాయింట్లతో 16వ స్థానంలో నిలవగా, గుర్జోత్‌ ఖంగురా అదే స్కోరుతో 18వ స్థానంలో నిలిచాడు. అనంతజీత్‌ సింగ్‌ 118 పాయింట్లతో వెనుదిరిగాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement