Wednesday, May 1, 2024

Breaking | పోరాటపటిమ చూపని చెన్నై బ్యాటర్లు.. గుజరాత్​ టార్గెట్​ ఎంతంటే?

గుజరాత్​తో జరిగిన క్వాలిఫయర్​–1లో చెన్నై పర్వాలేదు అనిపించింది. ఈ మ్యాచ్​లో రుతురాజ్​ గైక్వాడ్​ (60), డేవాన్​ కాన్వే (40), మినహా మిగతా బ్యాటర్లు ఎవరూ పెద్దగా ఆటతీరు కనబర్చలేదు. కీలక మ్యాచ్​లో చెన్నై జట్టు పోరాటం చూపకపోవడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. అలా రావడం, ఇలా వెళ్లడం అన్నట్టుగా వారి ఆట సాగింది. దీంతో చెన్నై అభిమానులు ఒకింత ఆగ్రహానికి గురయ్యారు. కెప్టెన్​ ధోనీ మెరుపులు మెరిపిస్తాడని ఆశించిన వారికి నిరుత్సాహమే మిగిలింది ధోని (1) ఒక్క పరుగు మాత్రమే తీసి అవుటవడంతో గ్యాలరీలోని కొంతమంది కన్నీరు పెట్టుకున్నారు. ఇక ఈ మ్యాచ్​లో నిర్ణీత ఒవర్లలో చెన్నైం 172 పరుగలు చేయగా, గుజరాత్​ 173 పరుగుల టార్గెట్​తో బరిలోకి దిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement