Wednesday, May 8, 2024

కరోనా రాదని ఆవుపేడ పూసుకుంటున్నారు.. కానీ ఇలా చేస్తే ప్రమాదం అంట

ఆవు పేడ, మూత్రం మిశ్రమాన్ని శరీరానికి రాసుకుంటే కరోనా వైరస్ దరిచేరదని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో గుజరాత్‌లో చాలామంది తమ శరీరానికి ఆవుపేడ, గో మూత్రం మిశ్రమాన్ని ఒంటికి రాసుకుంటున్నారు. దీంతో అక్కడ ఆవుపేడ, గోమూత్రానికి డిమాండ్ ఏర్పడింది. అయితే ఈ ధోరణి ప్రమాదకరమని వైద్య నిపుణులు అంటున్నారు. గోవుపేడ, గోమూత్రం కరోనాను కట్టడి చేస్తాయన్న దానికి శాస్త్రీయ ఆధారాలు లేవని డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు.

అంతేకాదు.. ఆవుపేడ, మూత్రం ద్వారా కొత్త జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. దీనిపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జె.ఏ.జయ్ లాల్ స్పందించారు. ఇలాంటివన్నీ ఒక్కొక్కరి నమ్మకాలకు సంబంధించిన విషయాలన్నారు. ఆవు పేడ, మూత్రంతో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందనడానికి రుజువులు లేవని స్పష్టం చేశారు. రోగ నిరోధక శక్తి గురించి సంగతి పక్కనబెడితే… జంతువుల నుంచి కొత్త జబ్బులు మానవులకు సంక్రమించే ప్రమాదం ఉందని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement