Sunday, May 5, 2024

Asian Hockey Cup | జ‌పాన్ ను చిత్తుగా ఓడించిన‌ భార‌త్.. 35-1 తేడాతో భారీ విజ‌యం

మెన్స్ ఆసియన్‌ హాకీ 5ఎస్‌ ప్రపంచ కప్ క్వాలిఫైయర్ మ్యాచ్ లో భారత పురుషుల జట్టు.. ఇవ్వాల రాత్రి 7.30 గంట‌ల‌కు ఎలీట్ గ్రూప్ లో జపాన్‌లతో జ‌రిగిన‌ పోటీలో భారీ విజ‌యం సొంతం చేసుకుంది. వ‌రల్డ్ క‌ప్ క్వాలిఫైయర్ మ్యాచ్ లో మొద‌టి నుంచి ఫుల్ జోష్ లో ఆడుతున్న భార‌త్ ఇవ్వాల (గురువారం) ఉద‌యం జ‌రిగిన మ్యాచ్ లో మలేషియాతో పోటీ ప‌డ‌గా.. 7-3 స్కోర్ తో విజ‌యం సొంతం చేసుకుంది.

కాగా, కొద్ది సేప‌టి క్రితం ఎలీట్ గ్రూప్ లో జ‌పీన్ తో త‌ల‌ప‌డ‌గా.. 35-1 తేడాతో జ‌పాన్ ను చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్ లో మొదటి అర్ధభాగం ముగిసేస‌రికి 18-0 పాయింట్ల‌తో ఆధిక్యంలో నిలిచింది భార‌త్. ఇక‌ సెకండాఫ్‌లోనూ త‌గ్గ‌కుండా 17 గోల్స్ చేసింది భార‌త జట్టు.. కాగా, మొద‌టి అర్థ భాగంలో ఒక్క గోల్ కూడా చేయ‌ని జ‌పాన్ సెకండాఫ్‌లో కేవ‌లం 1 గోల్ మాత్ర‌మే చేయ‌గ‌లిగింది. దీంతో ఇవ్వాల జ‌రిగి ఆఖ‌రి మ్యాచ్ లో జ‌పాన్ పై 35-1 స్కొర్ తేడాతో గెలిచి గేమ్ ని ద‌క్కించుంది భారత్.

ఇక, త‌మ ఫ‌స్ట్ మ్యాచ్ లో బంగ్లాదేశ్‌పై 15-1 తేడాతో ఘ‌న విజ‌యం సాదించిందిగా.. ఆ త‌ర్వాత జ‌రిగిన రెండో మ్యాచ్ లోనూ 12-2 స్కోర్ తో ఆతిథ్య జ‌ట్టు ఓమన్ ని చిత్తుగా ఓడించింది. అయితే నిన్న (బుద‌వారం) రాత్రి పాకిస్తాన్ తో జ‌రిగిన మ్యాచ్ లో4-5 తేడాతో ఒట‌మిపాలైంది.. కాగా, వ‌చ్చే ఏదాది (2024) హాకీ 5s ప్రపంచ కప్‌లో మొత్తం 16 దేశాలు పోటీ పడనుండ‌గా.. ఆ గ్లోబల్ ఈవెంట్‌లో స్థానం పొందాలంటే.. ప్ర‌స్తుతం జ‌రుగున్న టోర్నీలో భారత్ మొదటి మూడు స్థానాల్లో చేరాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement