Friday, May 24, 2024

Vice-Presidential election: జగదీప్ ధన్​ఖర్ vs మార్గరెట్ అల్వా.. ఇవ్వాలే ఎన్నికలు

ఉపరాష్ట్రపతి ఎన్నికలలో ఎలక్టోరల్ కాలేజీలో పార్లమెంటు ఉభయ సభలలో మొత్తం 788 మంది సభ్యులు ఉంటారు. జనతాదళ్ (యునైటెడ్), వైఎస్సార్​సీపీ, బీఎస్పీ, ఏఐఏడీఎంకే,శివసేన వంటి కొన్ని ప్రాంతీయ పార్టీల మద్దతుతో ఎన్​డీఏ అభ్యర్థి జగ్‌దీప్ ధన్‌కర్‌కు 515 ఓట్లకు పైగా వచ్చే అవకాశం ఉంది, ఇది అతని సులువైన విజయానికి సరిపోతుంది.

ఇక.. ప్రత్యర్థి అభ్యర్థి మార్గరెట్ అల్వా అభ్యర్థిత్వానికి కాంగ్రెస్, ఆప్, ఏఐఎంఐఎం, టీఆర్‌ఎస్, జేఎంఎం వంటి పార్టీలు ఇప్పటివరకు ప్రకటించిన మద్దతుతో 200కు పైగా ఓట్లు వచ్చే అవకాశం ఉంది. కానీ, లోక్‌సభలో 23 మంది, రాజ్యసభలో 16 మంది ఎంపీలను కలిగి ఉన్న తృణమూల్ కాంగ్రెస్ వీపీ రేసుకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది.

ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఓటింగ్ ఎలా జరుగుతుంది..

ఉపరాష్ట్రపతి ఎన్నికలలో ఎలక్టోరల్ కాలేజీలో పార్లమెంటు ఉభయ సభలలో మొత్తం 788 మంది సభ్యులు ఉంటారు. ఎలక్టర్లందరూ పార్లమెంటు ఉభయ సభల్లో సభ్యులు కాబట్టి ప్రతి ఎంపీ ఓటు విలువ ఒకే విధంగా ఉంటుందని– ఎన్నికల సంఘం తెలిపింది. దామాషా ప్రాతినిధ్య వ్యవస్థకు అనుగుణంగా ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ ఓటింగ్ రహస్య బ్యాలెట్ ద్వారా జరుగుతుంది. ఇక.. ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలతో బహుళ స్థానాల్లో ఓటింగ్ జరిగే ప్రెసిడెన్షియల్ పోల్‌లా కాకుండా..  ఎలక్టోరల్ కాలేజీలో భాగమైన ఉపరాష్ట్రపతి ఎన్నికలలో పార్లమెంట్ హౌస్‌లోనే ఈ ఓటింగ్ జరుగుతుంది.

ఈ ఎన్నికల్లో ఓపెన్‌ ఓటింగ్‌ అనే కాన్సెప్ట్‌ లేదని, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో బ్యాలెట్‌ను ఎవరికీ చూపించొద్దని స్పష్టంగాఉంది. అది పూర్తిగా నిషిద్ధం. ఈ విషయంలో పార్టీలు తమ ఎంపీలకు విప్‌ జారీ చేయలేవని ఈసీ హెచ్చరించింది.  

- Advertisement -

V-P ఎన్నికలు: పోలింగ్ ఇవ్వాల ఉదయం 10 గంటలకు ప్రారంభం

ఇవ్వాల (శనివారం) ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా ఉపరాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ జరగనుంది. ఆ తర్వాత వెంటనే బ్యాలెట్లను లెక్కించి ఈరోజు సాయంత్రంలోగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి తదుపరి ఉపరాష్ట్రపతి పేరును ప్రకటిస్తారు. నామినేటెడ్ సభ్యులతో సహా లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయడానికి అర్హులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement