Saturday, May 4, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 5, శ్లోకం 2

శ్రీ భగవాన్‌ ఉవాచ..

సన్న్యాస: కర్మయోగశ్చ
ని: శ్రేయసకరావుభౌ |
తయోస్తు కర్మసన్న్యాసాత్‌
కర్మయోగో విశిష్యతే ||

తాత్పర్యము : శ్రీ కృష్ణుడు సమాధానమొసగెను : కర్మ పరిత్యాగము మరియు భక్తితో కూడిన కర్మము రెండును ముక్తికి శ్రేయోదాయకములే. కాని ఆ రెండింటిలో కర్మ పరిత్యాగము కన్నను భక్తియుతకర్మము ఉత్తమమైనది.

భాష్యము : ” నేను చేసే కార్యాల ద్వారా వచ్చు ఫలితాలతో ఇంద్రియ భోగమును పెంచుకొందును” అనే భావన వ్యక్తిని మరల మరల జన్మించినునట్లు చేసి అంతులేని ఈ భవసాగరంలో పడవేస్తుంది. దీనికి తరుణోపాయము భోగ భావన నుండి హృదయమును పవిత్రీకరించుట. అది ఎప్పుడు సాధ్యమంటే భగవంతుడే సర్వమునకు యజమాని అని ఆయన సేవకే ప్రతీది ఉద్దేశించబడినదని, సేవకుడిగా ఆ సేవా కార్యము చేయువాడు ముక్తిని పొందును.అట్లు కాక ” నేను త్యాగినని, నాకున్నదంతా త్యజించి ఏ కార్యము చేయనని భావించు వ్యక్తిలో ” నాది ”, నేను త్యాగము చేయుచున్నాను అనే భావన భౌతికము కనక హృదయమును పవిత్రీకరించదు సరికదా స్వార్ధాన్ని పెంచే అవకాశము ఉండుటచే ముక్తుడు కాకపోగా ఏ క్షణము నైనా భవసాగరంలో మునిగిపోయే అవకాశము ఉన్నది.

- Advertisement -

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement