Friday, May 3, 2024

ఐబీపీఎస్ పరీక్షా ఫలితాలు విడుదల

ఐబీపీఎస్‌ క్లర్క్‌ మెయిన్స్‌ పరీక్ష ఫలితాలను ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలక్షన్‌ (ఐబీపీఎస్‌) విడుదల చేసింది. పరీక్ష రాసిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ www.ibps.inలో ఫలితాలు చూసుకోవచ్చని సూచించింది. ఈ నెలాఖరు వరకు ఫలితాలు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. దేశవ్యాప్తంగా వివిధ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న 2,257 క్లర్క్ పోస్టుల భర్తీకి ఐబీపీఎస్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మెయిన్స్‌ పరీక్షను గత ఫిబ్రవరి 28న నిర్వహించింది. ఈ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌ ద్వారా బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, కెనరా బ్యాంక్‌, ఇండియన్‌ ఓవర్కీస్‌ బ్యాంక్‌, యూకో బ్యాంక్‌ వంటి తదితర బ్యాంకుల్లో పోస్టులను భర్తీచేయనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement