Thursday, April 25, 2024

తెలుగు హీరోలకు ఇంత పెద్ద ఇల్లు ఉందా… ? కానీ యష్ కొన్నాడు !!

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాక్ స్టార్ యష్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం కేజిఎఫ్. ఈ సినిమాతో స్టార్ హీరోగా మారిపోయాడు యశ్. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా కేజిఎఫ్ 2 ను చేస్తున్నాడు. అయితే కె.జి.ఎఫ్ ఇచ్చిన స్టామినాతో ఆర్థికంగా కూడా బలపడ్డాడు. ఒక్కో సినిమాకు రెమ్యునరేషన్ 40 నుండి 50 కోట్ల వరకు అడుగుతున్నాడని సమాచారం. అయితే అంతేకాదు సొంత ఊర్లో 80 ఎకరాల కూడా కొన్నాడట.

ఆర్టీసీ బస్సు డ్రైవర్ కొడుకుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఒక్క సినిమాతో స్థార్ గా క్రేజ్ తెచ్చుకున్న యష్ ను అభినందించక తప్పదు. ఇదిలా ఉంటే ప్రస్తుతం యష్ నివాసం ఉంటున్న ఇల్లు ఖరీదు అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. బెంగళూరు లో అత్యంత విలాసవంతమైన ఓ ఇంటిని కొనుగోలు చేశారట యష్. ఈ ఇంటి విలువ సుమారు నాలుగు కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. ప్రస్తుతం ఆ ఇంట్లోనే యష్ ఉంటున్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement