Friday, April 19, 2024

మార్చిలో రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు

దేశంలో జీఎస్టీ ప్రవేశపెట్టిన తర్వాత అత్యధిక స్థాయిలో వసూళ్లు వచ్చాయి. కేంద్ర ఆర్థికశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం మార్చి నెలలో రికార్డు స్థాయిలో రూ.1.23 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైంది. మార్చి నెల వసూళ్లలో సీజీఎస్టీ రూ.22.973 కోట్లు, ఎస్జీఎస్టీ రూ.29,329 కోట్లు, ఐజీఎస్టీ రూ.62,842 కోట్లు. ఇప్పటివరకు ఇదే రికార్డు. జీఎస్టీ అమల్లోకి వచ్చాక ఇంత భారీస్థాయిలో మునుపెన్నడూ వసూలు కాలేదని ఆర్థిక శాఖ తెలిపింది. గతేడాది డిసెంబరులో జీఎస్టీ వసూళ్లు రూ.1.15 లక్షల కోట్లు కాగా, ఈ ఏడాది జనవరిలో రూ1.19 లక్షల కోట్లు, ఫిబ్రవరిలో రూ1.13 లక్షల కోట్లు వసూలయ్యాయి. తాజాగా మార్చిలోనూ జీఎస్టీ వసూళ్లు లక్ష కోట్లు దాటడం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement