Wednesday, May 15, 2024

కీచక ఐఏఎస్‌ అధికారి సస్పెండ్‌.. జార్ఖండ్‌లో ఐఐటీ స్టూడెంట్‌పై అఘాయిత్యం

ఓ ఐఐటి విద్యార్థిని పట్ల లైంగిక వేధింపులకు పాల్పడిన ఐఏఎస్‌ ఆఫిసర్‌ను జార్ఖండ్‌ ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. ఖుంతి జిల్లా సబ్‌ డివిజన్‌ మెజిస్ట్రేట్‌గా విధులు నిర్వహిస్తున్న అహ్మద్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అతన్ని రిమాండ్‌కు తరలించారు. తనను లైంగికంగా వేధింపులకు గురి చేసినట్టు ఓ విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అహ్మద్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ ఘటనపై జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌ తీవ్రంగా స్పందించారు. అహ్మద్‌ను విధుల నుంచి తొలగించాలని ఆదేశించారు.

అసలేం జరిగింది..?

ఓ ఐఐటికి చెందిన ఎనిమిదిమంది ఇంజినీరింగ్‌ విద్యార్థులు వర్క్‌ షాప్‌ పని నిమిత్తం ఖుంతి జిల్లాకు వచ్చారు. ఈ ఎనిమిది మందిలో ఒక అమ్మాయి కూడా ఉంది. అయితే వర్క్‌షాప్‌లో భాగంగా డిప్యూటి డెవలప్‌మెంట్‌ కమిషనర్‌ ఇంట్లో గత శనివారం రాత్రి విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు ఇంజినీరింగ్‌ విద్యార్థులు కూడా అటెండ్‌ అయ్యారు. ఈ క్రమంలో ఆ అమ్మాయిని ఐఏఎస్‌ అధికారి లైంగికంగా వేధించాడు. ఈ విషయాన్ని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అహ్మద్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement