Wednesday, May 15, 2024

ఈ సారి నార్మలైజేషన్‌ విధానంలో టెట్.. వెల్ల‌డించిన విద్యాశాఖ క‌మిష‌న‌ర్‌

అమరావతి, ఆంధ్రప్రభ: ఆగస్టులో జరగబోయే టీచర్‌ ఎలిజిబులిటీ టెస్ట్‌(టెట్‌)లో నార్మలైజేషన్‌ ప్రక్రియ అమలు చేయనున్నట్లు పాఠశాల విద్య కమిషనర్‌ ఎస్‌. సురేష్‌ కుమార్‌ తెలిపారు. శుక్రవారం ఒక ప్రకటనలో టెట్‌- 2022 ఆన్‌లైన్‌ పరీక్షల విధివిధానాలను ఇప్పటికే ఏపీటెట్‌.ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్‌.ఇన్‌ వెబ్‌సైట్‌లో ఉంచామన్నారు.

పరీక్ష జరగడానికి కొద్ది రోజుల ముందు నార్మలైజేషన్‌ పూర్తి విధివిధానాలను, వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచనున్నట్లు వెల్లడించారు. అభ్యర్థుల సంఖ్యను బట్టి పరీక్షను కొన్ని రోజులపాటు జరిగితే.. ఆయా రోజుల్లో కొన్ని ప్రశ్నాపత్రాలు కష్టంగా, కొన్ని సులభంగా ఉండే అవకాశాలుంటాయి. అందుకోసం నార్మలైజేషన్‌ ప్రక్రియ ద్వారా సగటు మార్కులను కేటాయించడం జరుగుతుంది. ఈ అంశంలో త్వరలో స్పష్టత రానుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement