Monday, April 29, 2024

Earthquake : అఫ్ఘానిస్థాన్‌లో భారీ భూకంపం.. తీవ్రత 6.2గా నమోదు

అఫ్ఘానిస్థాన్‌లో కాసేపటి క్రితం భారీ భూకంపం చోటుచేసుకుంది. ఈ భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 6.2 గా నమోదైంది. ఇవాళ మధ్యాహ్నం 12:42 గంటలకు తుర్క్‌మెనిస్థాన్‌లోని అస్గాబట్‌ నగరానికి ఆగ్నేయంగా 428 కిలో మీటర్ల దూరంలో సముద్ర మట్టానికి 34 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నమోదైందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మాలజీ వెల్లడించింది. ఈ భూకంపం చోటుచేసుకోవడంతో ఆ ప్రాంత ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. అయితే, ఈ భూకంపానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement