Monday, May 6, 2024

అమెజాన్​లో అదిరిపోయే డిస్కౌంట్స్​.. ప్రైమ్​ డే సేల్స్​ రేపటి వరకే!

ఏడాదిలోనే ఎప్పుడూ లేని విధంగా స్మార్ట్ ఫోన్లు, రిఫ్రిజిరేటర్లు, గృహోపకరణాలు, దుస్తులు సహా అన్ని కేటగిరీల వస్తువులపై అమెజాన్ ప్రైమ్ డే సేల్ లో భారీ డిస్కౌంట్ లభిస్తోంది. అమెజాన్ ప్రైమ్ డే సేల్ నిన్న (శుక్రవారం) అర్ధరాత్రి నుంచి ప్రారంభమైంది. ఇక రేపు (ఆదివారం) అర్థరాత్రి వరకు ఈ సేల్ కొనసాగనుంది. అయితే.. కేవ‌లం ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ ఉన్నవారు మాత్రమే ఈ సేల్ లో అతి తక్కువ ధరలకు వస్తువులు కొనుగోలు చేయవచ్చు. మరి అమెజాన్ ప్రైమ్ డే సేల్ లో ఏ ఏ వస్తువులపై ఎంత డిస్కౌంట్ ఉందో ఇప్పుడు చూద్దాం..

- Advertisement -

ఈ సేల్ లో ఐఫోన్లపై భారీ డిస్కౌంట్ ఉంటుందని అందరూ అంచనా వేశారు. మరికొద్ది రోజుల్లో ఐఫోన్ 15 సిరీస్ వస్తుండగా.. ఐఫోన్ 14 సిరీస్ ఫోన్లు తక్కువ ధరకు లభిస్తాయని అనుకున్నారు. అయితే ఐఫోన్ 14 (128 జీబీ) పై 17 శాతమే డిస్కౌంట్ ఉంది. దీని అసలు ధర రూ.79,999 కాగా, 17 శాతం డిస్కౌంట్ తో రూ.66,799కి లభిస్తోంది. క్రెడిట్ కార్డు ఆఫర్ల ద్వారా మరో రూ.1000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు.

ఈ సేల్ లో భాగంగా పలు రిఫ్రిజిరేటర్లపై 55 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తోంది అమెజాన్. పాపులర్ బ్రాండ్ల ఫ్రిజ్ లను పరిశీలిస్తే హయర్ 351 లీటర్ల ఇన్వర్టర్ ఫ్రోస్ట్ ఫ్రీ సైడ్ బై సైడ్ రీఫ్రిజిరేటర్ పై 40 శాతం డిస్కౌంట్ ఉంది. ఆఫర్ లో ప్రస్తుతం దీని ధర రూ. 76,990 గా ఉంది.గోద్రేజ్ 564 లీటర్ల సైడ్ బై సైడ్ అడ్వాన్స్డ్ రిఫ్రిజిరేటర్ ధర 37 శాతం డిస్కౌంట్ తో రూ. 59,990 గా ఉంది. ఇతర ముఖ్యమైన బ్రాండ్లపై కూడా ఆకర్షణీయమైన డిస్కౌంట్లు ఉన్నాయి.

అలాగే ఈ సేల్ లో పలు బ్రాండ్ల ఏసీలపై 55 శాతం వరకు డిస్కౌంట్ ఉంది. వాషింగ్ మెషీన్ల ధరలు డిస్కౌంట్ లో రూ. 5,990 నుంచి ప్రారంభవుతున్నాయి. మైక్రోవేవ్ లు రూ. 4,499 నుంచి అందుబాటులో ఉన్నాయి. గృహోపకరణాల పై 70 శాతం వరకు డిస్కౌంట్ ఉంది. మెడిసిన్ల పై కూడా 35 శాతం డిస్కౌంట్ ఉంది. స్మార్ట్ టీవీలపై 60 శాతం వరకు డిస్కౌంట్ ఉంది. కెమెరా లెన్సులపై 80 శాతం వరకు డిస్కౌంట్ ఉంది. దుస్తులపై 60 శాతం వరకు డిస్కౌంట్ ఉంది. ఇటీవల విడుదలైన రియల్మీ నార్జో సిరీస్ ఫోన్లపై 11 శాతం ఆఫ్ ఉంది.

మీడియం రేంజ్ స్మార్ట్ ఫోన్ సెగ్మెంట్ లో శాంసంగ్ ఎం 14 5జీ స్మార్ట్ ఫోన్ పై 18 శాతం డిస్కౌంట్ ఉంది. దీని అసలు ధర రూ. 18,999 కాగా ఆఫర్ లో రూ. 15,490 కే లభిస్తోంది.

డిస్కౌంట్ తో పాటు ఈ సేల్ లో ఐసీఐసీఐ, ఎస్బీఐ క్రెడిట్ కార్డులపై 10 శాతం ఇన్ స్టాంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ కార్డుల ద్వారా అత్యధికంగా రూ. 2,500 వరకు ఆఫర్ ఉంటుంది

Advertisement

తాజా వార్తలు

Advertisement