Saturday, June 3, 2023

బంగ్లాదేశ్ లో హిందూ దేవాల‌యాల‌పై దాడి…14 విగ్ర‌హాలు ధ్వసం..

ఢాకా: బంగ్లాదేశ్‌లో మతఛాందసవాదులు హిందూ ఆలయాలపై దాడులకు పాల్పడుతూ,. దేవతామూర్తుల విగ్రహాలను ధ్వసం చేస్తున్నారు. తాజాగా ఠాకూర్‌గావ్‌ జిల్లాలోని ధంతాలా, పారియా, చారుల్‌ యూనియన్లలో ఉన్న పురాతమనమైన కాళీ మాత ఆలయంతోపాటు మరో 11 దేవాలయాలపై గుర్తుతెలియని వ్యక్తులు దాడిచేశారు. ఆలయాల్లో ఉన్న 14 విగ్రహాలను ధ్వంసం చేశారు.ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున జరిగిందని బాలియదంగీ పోలీస్‌ అధికారి ఖరుల్‌ ఆనమ్‌ తెలిపారు. దాడికి పాల్పడిన దుండగులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు

Advertisement

తాజా వార్తలు

Advertisement