Saturday, April 27, 2024

ఏపీలో ఆధార్ కేంద్రాల్లో భారీగా వసూళ్లు.. ప్రజలకు ఇక్కట్లు

ఏపీ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. ప్రభుత్వం చేపట్టిన ఈ సంక్షేమ పథకాలను ప్రజలు పొందాలంటే తమ ఆధార్ కార్డును అనుసంధానం చేయాల్సి ఉంటుంది. దీనికోసం బ్యాంకులు, పోస్టాఫీసుల్లో ఆధార్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. కొత్తగా ఆధార్‌కార్డుకు దరఖాస్తు చేసుకోవాలన్నా, మార్పులు, చేసుకోవాలనుకున్నా బ్యాంక్ లేదా పోస్టాఫీస్‌లోని ఆధార్ కేంద్రానికి ప్రజలు వెళ్లాల్సి వస్తోంది.

ఆధార్ కార్డులలో సవరణల కోసం ప్రజలు ఆధార్ కేంద్రాలకు భారీ సంఖ్యలో వెళ్తున్నారు. ఈ మేరకు ఆధార్ కార్డుల్లో సవరణలకు రూ.50, బయోమెట్రిక్ నమోదుకు రూ.100 ఫీజును అధికారులు వసూలు చేస్తారు. అయితే పలు ఆధార్ కేంద్రాల్లో సవరణలకు రూ.50 బదులు రూ.100, బయోమెట్రిక్ నమోదుకు రూ.100 బదులు రూ.500 వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ఫిర్యాదు చేసినా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. మరోవైపు ఆధార్ కేంద్రాల్లో రద్దీ నెలకొని ఉండటంతో కొత్త ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి మీ సేవా కేంద్రంలో ఆధార్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

కాగా ఆధార్ ఛార్జీలు ఎక్కువ తీసుకుంటే 1947 నెంబర్‌కు కాల్ చేసి కంప్లైంట్ ఇవ్వొచ్చు. లేదా [email protected] మెయిల్ ఐడీకి మెయిల్ పంపి మీ కంప్లైంట్ రిజిస్టర్ చేయొచ్చు. లేదంటే నేరుగా https://resident.uidai.gov.in/file-complaint ఈ లింక్ క్లిక్ చేసి కూడా ఫిర్యాదు చేయొచ్చు.

ఇది కూడా చదవండి: జూన్ నెలలో రికార్డు స్థాయిలో యూపీఐ పేమెంట్లు

Advertisement

తాజా వార్తలు

Advertisement