Wednesday, May 1, 2024

కేజీఎఫ్2 ఆడియోపై మరో అదిరిపోయే అప్డేట్ !!

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాక్ స్టార్ యశ్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం కేజీఎఫ్. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈచిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ సాధించింది. అంతేకాకుండా నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఇక ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ కే జి ఎఫ్ చాప్టర్2 తెరకెక్కుతోంది. ఇక ఇటీవల ఈ సినిమాకు సంబంధించి సౌత్ ఆడియో రైట్స్ మంచి ధరను పలికాయి.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో మొత్తం ఐదు పాటలు ఉంటాయట. కే జి ఎఫ్ చాప్టర్1 తరహాలోనే రెండు సాంగ్స్ కథను ఆనుకుని ఉంటాయట. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్ ఆగస్టు మొదటి రెండు వారాల్లో వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే ఈ సినిమా రిలీజ్ కోసం దేశ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement