Monday, April 29, 2024

హీరో విన‌య్ తో హీరోయిన్ విమ‌ల రామ‌న్.. ప్రేమ‌లో ప‌డిందా..!

తెలుగు..మ‌ల‌యాళం.. క‌న్న‌డ భాష‌ల్లో హీరోగా న‌టించాడు విన‌య్.. కాగా హీరోయిన్ విమ‌ల రామ‌న్ తో ఈ హీరో ల‌వ్ లో ఉన్న‌ట్లు స‌మాచారం. ఆస్ట్రేలియాలో పుట్టి పెరిగి మిస్ ఇండియా, మిస్ ఆస్ట్రేలియా పోటీల్లో టైటిల్ గెలుచుకుంది విమల రామ‌న్.
ఆ తర్వాత మోడల్ రంగంలోకి ప్రవేశించిన విమల రామన్ ను దర్శకుడు కే. బాలచందర్ పొయ్ చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయం చేశారు. ఆ తర్వాత చేరన్ దర్శకత్వంలో రామన్ తేడియా సీతై చిత్రాలలో నటించి ఆ తర్వాత మాలివుడ్ కి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు తెలుగు, తమిళ్, కన్నడ , మలయాళం భాష లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఈమె ఏడాది వినయ్ తో ప్రేమలో ఉన్నట్టు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈమె పుట్టినరోజు వేడుకలు గ్రాండ్గా జరుపుకోగా.. ఆ వేడుకలో కుటుంబ సభ్యులతో పాటు వినయ్ కూడా పాల్గొనడం విశేషం. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. దీంతో వీరిద్దరి మధ్య ప్రేమాయణం సాగుతోందనే ప్రచారం కూడా జరుగుతోంది. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లుగా కూడా వార్తలు వినిపిస్తూ ఉండడం ఇప్పుడు మరింత చర్చనీయాంశంగా మారింది. మారుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement