Monday, May 6, 2024

నా ఎంగేజ్ మెంట్ సిరీస్1 పిక్స్- మీ కోసం – హీరోయిన్ పూర్ణ‌

హీరోయిన్ పూర్ణ ఎంగేజ్‌మెంట్‌ గ్రాండ్‌గా జరిగింది. ఆయా ఎంగేజ్‌మెంట్‌ఫోటోలను సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంది పూర్ణ. ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా రెండు రోజులుగా ఓ సిరీస్‌ వైజ్‌గా తన ఎంగేజ్‌మెంట్ పిక్స్ ని షేర్‌ చేసుకుంది. సిరీస్‌ 1 అంటూ కొన్ని పిక్స్ ని పంచుకుంది. ఇందులో పూర్ణ ఎంగేజ్‌మెంట్‌ సందర్భంగా తన సింగిల్‌ ఫోటో షూట్‌ పిక్స్ ఉన్నాయి. మరో పోస్ట్ లో తన ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటోలున్నాయి. ఫ్యామిలీతో కలిసి ఎంతో సంతోషంగా ఉంది పూర్ణ. సేమ్‌ డ్రెస్‌ కోడ్‌లో పూర్ణ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. గ్రూప్‌ ఫోటోలు ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి. మరోవైపు తన పేరెంట్స్ తో పూర్ణ దిగిన ఫోటోలు ఆద్యంతం హైలైట్‌గా నిలిచాయి.

పూర్ణని ముద్దాడుతుండగా, ఎంతో సహజంగా కెమెరాలో బంధించిన తీరు మరింత హైలైట్‌ అవుతుంది. ఇందులో పూర్ణ ఓ యువరాణిలా ఉన్నారు. . గ్రాండ్‌గా డిజైనింగ్‌ వేర్‌లో కనిపిస్తూ కనువిందు చేస్తుంది. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో పూర్ణ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. ఈ సందర్బంగా పూర్ణ మాట్లాడుతూ , నేను నా ఫోటోలతో ప్రేమలో పడ్డా. నా జీవితంలోని మధుర క్షణాలను క్యాప్చర్‌ చేసిన కెమెరామెన్‌కి ధన్యవాదాల‌ని పేర్కొంది పూర్ణ. ఈ సందర్భంగా తన ఫోటోలతోపాటు వీడియోలను పంచుకుంది పూర్ణ. దీంతో సెలబ్రిటీలు, ఆమె అభిమానులు పూర్ణ-షానిద్‌ జోడీకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే ఈ ఫోటోల్లో తన కాబోయే భర్త షానిద్‌ లేకపోవడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement