Monday, May 6, 2024

బార్ లో ఎంజాయ్ చేస్తోన్న పాయ‌ల్ రాజ్ పుత్-ఫుల్ బాటిల్స్ మ‌ధ్య‌లో కిర్రాక్ ఫోజులు

బార్ లో ఎంజాయ్ చేస్తోంది హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ . ఫుల్ బాటిల్స్ మధ్యలో కూర్చొని కిరాక్ ఫోజులిచ్చారు. చేతిలో మందు సీసాలతో చుక్కేస్తున్నట్లు పాయల్ కలరింగ్ ఇచ్చారు. ఇక పాయల్ ని అలా చూసిన ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. చేతిలో మందు సీసాలతో చుక్కేస్తున్నట్లు పాయల్ కలరింగ్ ఇచ్చారు. చీర్స్ చెబుతున్న పాయల్ కి చీర్స్ అంటూ సమాధానం చెబుతున్నారు. పాయల్ లేటెస్ట్ ఫోటోస్ వైరల్ గా మారాయి. మరి ఏదైనా షూట్ లో భాగంగా పాయల్ అలా కనిపించారా లేదా నిజంగా బార్ కి వెళ్ళారా అనేది తెలియదు.

సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించిన పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా ఎదిగారు. ప్రస్తుతం మంచు విష్ణుకు జంటగా జిన్నా మూవీలో చేస్తున్నారు. జిన్నా మూవీలో పాయల్ తో పాటు సన్నీ లియోన్ మరో హీరోయిన్ గా నటిస్తున్నారు. అలాగే యంగ్ హీరో ఆది సాయి కుమార్ కి జంటగా తీస్ మార్ ఖాన్ మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీలో పాయల్ రెచ్చిపోయి నటించినట్లు తెలుస్తుంది. వీటితో పాటు ఓ తమిళ్, ఓ కన్నడ, తెలుగు చిత్రాల్లో పాయల్ నటిస్తున్నారు. ఇక ఓటీటీ చిత్రాలు చేస్తున్నారు. ఆమె హీరోయిన్ గా నటించిన 3 రోజెస్ ఆహా లో విడుదలైంది. అంతకు ముందు అనగనగా ఓ అతిథి అనే మూవీలో నటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement