Tuesday, May 14, 2024

శివ‌కార్తికేయ‌న్ తాజా చిత్రం-టైటిల్ రిలీజ్ చేసిన సూప‌ర్ స్టార్

రెమో చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కి ప‌రిచ‌య‌మ‌య్యాడు త‌మిళ హీరో శివ‌కార్తికేయ‌న్. ప్ర‌స్తుతం ఈయ‌న నేరుగా తెలుగులో ‘ప్రిన్స్’ సినిమా చేస్తున్నాడు. ‘జాతిర‌త్నాలు’ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాను తెర‌కెక్కించిన అనుదీప్ కేవి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం దీపావ‌ళి కానుక‌గా విడుద‌ల కానున్న‌ట్లు ఇటీవ‌లే ప్ర‌క‌టించారు. తెలుగుతో పాటు త‌మిళంలో ఈ చిత్రం ఏక‌కాలంలో తెర‌కెక్కుతుంది. ఇదిలా ఉంటే శివ కార్తికేయ‌న్ త‌దుప‌రి సినిమా టైటిల్‌ తాజాగా విడుద‌లైంది. త‌మిళ హీరో శివ కార్తికేయ‌న్ తాజా సినిమా టైటిల్ విడుద‌లైంది. శివకార్తికేయ‌న్ త‌న త‌దుప‌రి చిత్రాన్ని మ‌డోన్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌నున్నారు. ప్ర‌స్తుతం ఈ చిత్రం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌లో బిజీగా ఉంది. తాజాగా ఈ సినిమా టైటిల్‌ను సూప‌ర్ స్టార్ మ‌హేష్‌బాబు రివీల్ చేస్తూ టైటిల్ వీడియోను విడుద‌ల చేశారు. ఈ చిత్రానికి తెలుగులో ‘మ‌హావీరుడు’ అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు.లేటెస్ట్‌గా విడుద‌లైన టైటిల్‌ వీడియో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటుంది. శాంతీ టాకీస్ బ్యాన‌ర్‌పై అరుణ్ విశ్వ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భ‌ర‌త్ శంక‌ర్ సంగీత ద‌ర్శ‌కుడిగా ప‌నిచేస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement