Tuesday, May 14, 2024

రామ్ చ‌ర‌ణ్ 15నుండి.. మ‌రోసారి ఫొటోలు లీక్

మ‌రోసారి మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ 15వ చిత్రం నుండి ఫొటోలు రిలీజ్ అయ్యాయి. ఈ చిత్రాన్ని శంక‌ర్ తెర‌కెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షెడ్యూల్ షూటింగ్ రాజమండ్రిలో జరుగుతోంది. మెయిన్ గా సీనియర్ పాత్ర కోసం షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ కి కీలకమైన ఎపిసోడ్ సంబంధించిన షూటింగ్ ఇక్కడ జరుగుతోంది. తండ్రి పాత్రకు తగ్గట్టుగా రామ్ చరణ్ గెటప్ ఉన్నట్లు కనిపిస్తోంది.

అంతే కాదు ఈ షెడ్యూల్ లో ఎన్నికల ప్రచారానికి సంబంధించిన సీన్స్ షూట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. రామ్ చరణ్ ఎన్నికల ప్రచారంలో కనిపించనున్నాడని తెలుస్తోంది. అందుకు సబంధించి పంచె, కుండువ వేసుకున్న చరణ్ లుక్ ఉంది. అంతే కాదు ఆయన పార్టీ గుర్తు ట్రాక్టర్ కి ఓటు వేయాలని అభ్యర్థన చేస్తున్నట్టు సీన్స్ ఉన్నాయట. వచ్చే వేసవి కాలం వరకు షూటింగు పూర్తి చేసి విడుదల చేయాలని దిల్ రాజు నిర్ణ‌యించిన‌ట్లు వార్తలు వస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement