Monday, April 29, 2024

ఆదిలాబాద్‌ జిల్లాలో ఐదో రోజూ జోరు వానలు.. రహదారులపై వదర, నిలిచిపోయిన రాకపోకలు

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. ఐదో రోజు మంగళవారం కూడా జిల్లాలో అధిక వర్షపాతం నమోదైంది. పల్లె, పట్టణమనే తేడా లేకుండా జిల్లాలో అప్రకటిత బంద్‌ వాతావరణం నెలకొని ఉంది. అత్యధికంగా కుమ్రంభీమ్‌ ఆసిఫాబాద్‌ జిల్లా కెరమెరి మండలంలో 16.45 సెంటీమీటర్లు, నిర్మల్‌ జిల్లా మామడ మండలంలో 16.24 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఏజెన్సీ ప్రాంతమైన ఉట్నూరు సమీపంలోని నాగ్‌పూర్‌ వంతెనపై వరద పొంగిపొర్లడంతో ఆదిలాబాద్‌, మంచిర్యాల మార్గంలో రవాణా స్తంభించిపోయింది.

ఇంద్రవెల్లి మండలం ధర్మసాగర్‌కు చెందిన తొమ్మిది నెలల గర్భిణీని ప్రసవం నిమిత్తం ఆదిలాబాద్‌కు తరలిస్తున్న క్రమంలో వాగు పొంగిపొర్లడంతో ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. అతి కష్టంమీద ఆమెను ఆదిలాబాద్‌ రిమ్స్‌కు తరలించారు. నిర్మల్‌ – మంచిర్యాల ప్రధాన రహదారిపై మామడ మండలం న్యూసాంగ్వీ వద్ద అప్రోచ్‌ రోడ్‌ కోతకు గురైన ప్రాంతాన్ని అటవీ, దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పరిశీలించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement