Thursday, April 18, 2024

‘‘థ్యాంక్యూ’’ మూవీ ట్రైల‌ర్ రిలీజ్‌.. డిఫ‌రెంట్ స్టేజెస్‌లో లైఫ్ జ‌ర్నీని ఎలివేట్ చేసేలా బీజేఎం

టాలీవుడ్ యువ నటుడు నాగ చైతన్య కొత్త మూవీ థ్యాంక్యూకు సంబంధించిన ట్రైల‌ర్ ఇవ్వాల రిలీజ్ చేశారు. ఇప్పటికే సినిమా నుంచి టీజర్, పాటలను రిలీజ్ చేశారు. తాజాగా సినిమా ట్రైలర్ ను కూడా రిలీజ్ చేసింది మూవీ యూనిట్. అన్ని ఎలిమెంట్స్ ను టచ్ చేస్తూ ట్రైలర్ ని కట్ చేశారు. దీంతో డిఫరెంట్ స్టేజెస్ లో హీరో లైఫ్ జర్నీని ట్రైలర్ లో చూపించారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ట్రైలర్ ని మరింత ఎలివేట్ చేసేలా ఉంది. సినిమాకు బీవీఎస్ రవి కథ అందించారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు.

రీసెంట్ గా ‘లవ్ స్టోరీ’, ‘బంగార్రాజు’ సినిమాలతో మంచి హిట్స్ అందుకున్నాడు చెయ్. ఇప్పుడు ‘థ్యాంక్యూ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వ‌స్తున్నాడు. విక్రమ్ కె.కుమార్ డైరెక్ష‌న్ లో దిల్ రాజు నిర్మించిన‌ ఈ సినిమాలో రాశి ఖన్నా, అవికా గోర్, మాళవిక నాయర్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. జూలై 22న థియేట‌ర్ల‌లో రిలీజ్ కానుండ‌గా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ ప‌నులు జరుగుతున్నాయి. ఇక‌ దానికి తగ్గట్లుగా ప్రమోషన్స్ మొదలుపెట్టారు మేక‌ర్స్.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement