Saturday, April 27, 2024

లండన్​లో బతుకమ్మ సంబురాలు.. హాజరైన హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు

లండన్ సిటీలో తెలంగాణ జాగృతి యూకే శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాలు అంబరాన్నిఅంటాయి. లండన్ బతుకమ్మ వేడుకలకు తెలంగాణ రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాస రావు ముఖ్య అతిధిగా హాజరై మహిళా సోదరీమణులతో బతుకమ్మ ఆడి పాడి సందడి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంకాని దేశంలో తెలంగాణ సంసృతి , సంప్రదాయాలు ఉట్టిపడేలా ఆడపడుచులు తీరొక్క పూలతో తీర్చిదిద్దిన బతుకమ్మలు లండన్ వీధులకు పండగ శోభ తీసుకొచ్చాయన్నారు.

తెలంగాణ సంసృతికి నిలువుటద్దంగా నిలుస్తున్న బతుకమ్మ వేడుకలను తన జన్మభూమి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం కొత్తగూడెం పట్టణంలోని జనహిత ప్రాంగణంలో GSR TRUST ఆధ్వర్యంలో తొమ్మిది రోజుల పాటు నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. అమ్మవారి ఆశీస్సులు అందరికి దండిగా లభించాలని.. విజయ దశమి సాక్షిగా విజయాలు వరించాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. లండన్ నగరంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో ప్రవాస భారతీయ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement