Wednesday, May 8, 2024

ఆదివాసి సంక్షేమానికి ఆరోగ్యం, విద్య కీల‌కం : గ‌వర్న‌ర్ సౌంద‌ర‌రాజ‌న్..

ఆదివాసి, గిరిజన తెగలకు చెందిన ప్రజల ఆరోగ్యం, విద్యపై ప్రత్యేక దృష్టి సారించాలని గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌ పిలుపునిచ్చారు. పౌష్టికాహార స్థితిని మెరుగుపరచేందుకు, ఆదిమ గిరిజన సమూహాల ప్రజలలో విద్యను ప్రోత్సహించడానికి నిరంతర ప్రయత్నాలు చేయడం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. గురువారం రాజ్‌భవన్‌లో ఆదిలాబాద్‌, నాగర్‌కర్నూల్‌, భద్రాద్రి జిల్లాల్లోని ఎంపిక చేసిన మూడు జిల్లాల గిరిజన ఆవాసాలలో ఆదిమ గిరిజన సమూహాల ప్రజల పోషకాహార స్థితిని మెరుగుపరచేందుకు చేపట్టిన పోషకాహార జోక్య చొరవపై సమీక్షించారు. గిరిజన ప్రజలలో పరిశుభ్రతను పెంపొందించడం ద్వారా వారికి మెరుగైన ఆరోగ్యాన్ని అందించవచ్చన్నారు.

గిరిజనుల సర్వతోముఖా భివృద్ధిని నిర్ధారించే లక్ష్యంతో విభిన్న కార్యక్రమాలను ప్రారంభించామని, అయితే కొన్ని స్పష్టమైన ఫలితాలను పొందడానికి సమయానుకూల కార్యాచరణ ప్రణాళికతో పాటు అమలుకు దృష్టి సారించనున్నట్లు గవర్నర్‌ తెలిపారు. గిరిజన ప్రజల జీవనోపాధిని మెరుగుపరచేందుకు , వారిని ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు వ్యవసాయ, పశు వైద్య, ఉద్యానవన విశ్వవిద్యాలయాలలో గిరిజన ప్రజలకు సుస్థిక వ్యవసాయ పద్ధతులు, పశుపోషణ, పాడి వ్యవసాయం, కూరగాయల సాగులో సిక్షణ ఇవ్వాలన్నారు. ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ, నేషన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌, ఇఎస్‌ఐసీ మెడికల్‌ కాలేజ్‌, కెఎన్‌ఆర్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌, వ్యవసాయ, ఉద్యానవన, వెటర్నరీ విశ్వవిద్యాలయాలు, సెంటర్‌ ఫర్‌ లెర్నింగ్‌ అండ్‌ ప్రాక్టీసింగ్‌ లా కార్యకర్తలతో పౌషకాహార జోక్య పురోగతిని సమీక్షించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement