Friday, April 19, 2024

ఇంట‌ర్ బోర్డు వ‌ద్ద విద్యార్థి సంఘాల ఆందోళ‌న


తెలంగాణ రాష్ట్రంలో నిన్న ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్ ఫ‌లితాలు విడుద‌ల‌య్యాయి. అయితే ఈ ఫలితాలపై విద్యార్థుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఇవాళ‌ ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. చదువు చెప్పకుండా విద్యార్థులను ప్రభుత్వం ఫెయిల్ చేయించిందని విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. ఇంటర్ ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం తగ్గడానికి ప్రభుత్వ విధానాలే కారణమని ఎస్ఎఫ్‌ఐ నేతలు ఆరోపించారు.

తాము వద్దని డిమాండ్ చేస్తున్నా పరీక్షలు నిర్వహించి ఇప్పుడు విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుకుంటున్నారని విమర్శలు చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో పలువురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని ఎస్ఎఫ్‌ఐ నేత‌లు ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస మార్కులతో అయినా విద్యార్థులను పాస్ చేయించాలని వారు డిమాండ్ చేశారు. ఇంటర్నెట్ కనెక్షన్ లేక చాలామంది పేద విద్యార్థులు తరగతులకు హాజరు కాలేకపోయారని, ఫెయిలైన వారందరినీ పాస్ చేయాలని డిమాండ్ చేశాయి. దీంతో ఆందోళన చేస్తున్నవారిని పోలీసులు పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement