Sunday, April 28, 2024

Breaking: హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా.. కొత్త ముఖ్యమంత్రిగా నయబ్ సింగ్

హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా చేశారు. గవర్నర్ కు సీఎం రాజీనామా లేఖను సమర్పించారు. జేజేపీ, బీజేపీ కూటమిలో విభేదాలు చోటుచేసుకున్నాయి. దీంతో సీఎం రాజీనామా చేశారు. భారతీయ జనతా పార్టీ(బీజేపీ), దుష్యంత్ చౌతాలాకు చెందిన జననాయక్‌ జనతా పార్టీ(జేజేపీ) విబేధాలు చోటుచేసుకున్నాయి. సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే యోచనలో బీజేపీ ఉంది

హ‌ర్యానా కొత్త సీఎంగా న‌య‌బ్ సింగ్…
హర్యానా కొత్త ముఖ్యమంత్రి పేరును బీజేపీ అధిష్టానం ఫైనల్ చేసింది. నూతన సీఎం అభ్యర్థిగా హర్యానా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయబ్ సింగ్ సైకి బాధ్యతలను అప్పగించింది. .

ఇదిలా ఉంటే.. 90 స్థానాలున్న హర్యానా అసెంబ్లీలో బీజేపీకి 41, జేజేపీకి 10, కాంగ్రెస్‌కు 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో పాటు బీజేపీకి ఆరుగురు స్వతంత్రులు, ఒక హర్యానా లోఖిత్ పార్టీ ఎమ్మెల్యే గోపాల్ కందా మద్దతు ఉంది. ఈ లెక్కన.. జేజేపీ విడిపోయిన తర్వాత కూడా బీజేపీకి 48 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండడంతో బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement