Friday, April 26, 2024

వారంలో గురుకుల నోటిఫికేషన్‌! భర్తీకి ఏర్పాట్లు చేస్తున్న టీఆర్‌ఈఐఆర్‌ బోర్డు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు మరో తీపికబురు చెప్పనుంది. త్వరలోనే మరో నోటిఫికేషన్‌ను వెలువడనుంది. ఇప్పటికే పలు ఉద్యోగ నోటిఫికేషన్లు వరుసగా వెలువడుతున్నాయి. సంక్రాంతి పండుగ తర్వాత గురుకులాల్లోని ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ను జారీ చేసేందుకు తెలంగాణ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు(టీఆర్‌ఈఐఆర్‌బీ) ఇందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే 11,687 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసేందుకు మార్గం సుగమం అయింది. ఈ వారం రోజుల్లో గురుకుల నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం ఉంది.

ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ శాఖలు తమ గురుకులాల్లో ఖాళీలను గుర్తించి మొదట ప్రభుత్వానికి మొత్తంగా 9,096 పోస్టుల ప్రతిపాదనలను పంపించాయి. వాటికి ఆర్థికశాఖ ఆమోదం కూడా లభించింది. తర్వాత ప్రభుత్వం అదనంగా 33 బీసీ గురుకుల పాఠశాలలు, 15 గురుకుల డిగ్రీ కళాశాలలను మంజూరు చేసింది. ఈక్రమంలో ఆయా గురుకులాకు సైతం 2,591 పోస్టులను కేటాయించింది.

- Advertisement -

ఇటీవల ఈ పోస్టులకు కూడా ఆర్థికశాఖ ఆమోదం లభించింది. మొత్తంగా గురుకులాల్లో 11,687 పోస్టుల భర్తీకి లైన్‌ క్లియర్‌ అయ్యింది. ఈనేపథ్యంలో సంక్రాంతి తర్వాత రెండుమూడ్రోజుల్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసేలా అధికారులు సన్నద్ధమవుతున్నారు. రోస్టర్‌ ప్రాతిపదికన పోస్టులను రిజర్వు చేసింది. నోటిఫికేషన్‌ జారీ, పరీక్ష తేదీల నిర్ణయంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement