Monday, April 29, 2024

మ‌హేశ్ బాబుకి చెల్లెలిగా న‌టించిన నిహారిక‌-ఇప్పుడు ఎలా ఉందో తెలుసా

గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ చిత్రం ఒక్కడు .ఈ సినిమాలో సూప‌ర్ స్టార్ మహేష్ బాబును ఆటపట్టించిన అల్లరి చెల్లి ఆశ ప్రతి ఒక్కరికి గుర్తుంటుంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన నిహారిక ప్రస్తుతం ఇద్దరు పిల్లల తల్లి.హీరో వెంకటేష్ నటించిన ప్రేమించుకుందాంరా, మహేష్ బాబు నటించిన ఒక్కడు, మోహన్ బాబు నటించిన యమజాతకుడు వంటి పలు చిత్రాలలో ఈమె చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. ఇక చివరిగా ఒక్కడు సినిమా తర్వాత నటనకు పూర్తిగా దూరమైంది. నిహారిక సినిమాలలో అవకాశాలు వచ్చినా కూడా చదువు పైన దృష్టి సారించింది. దాదాపు పది సంవత్సరాల క్రితం పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ కి చెందిన ఒక వ్యక్తిని వివాహం చేసుకుని ప్రస్తుతం ఈమెకు ఇద్దరు పిల్లలు కూడా. ఇక ఈమె వివాహానికి ప్రస్తుత సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా హాజరయ్యారు. అంతేకాదు పలువురు సినీ ప్రముఖులు కూడా నిహారిక వివాహానికి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.ఇప్పుడు ఈమె ఫొటో నెటింట వైర‌ల్ అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement