Thursday, May 16, 2024

LSG vs GT | స్వ‌ల్ప ఛేదనలో తడబడ్డ గుజరాత్.. లక్నో హ్యాట్రిక్ విన్

ఎకానా స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్ విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 5 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. అయితే స్వల్ప చేదనలో గుజరాత్ టైటాన్స్ జట్టు తడబడింది. 18.5 ఓవర్లలో 130 పరుగులకు ఆలౌటైంది. దీంతో లక్నో జట్టు 33 పరుగుల తేడాతో విజయం సాధించి పాయింట్ల పట్టికలో నాలుగు నుంచి మూడో స్థానానికి ఎగబాకింది.

164 పరుగుల చేజ్‌లో గుజరాత్ కెప్టెన్ గిల్ (19) పరుగులు చేసి యశ్ ఠాకూర్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. ఆ తరువాత కేన్ విలియమ్‌సన్ ఒక్క పరుగు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఆ తరువాత ఓవర్లో కీపర్ బీఆర్ శరత్(2) అవుట్ అయ్యాడు. గుజరాత్ స్కోర్ ఒక్కసారిగా 54-0 నుంచి 61-4 పడిపోయింది. ఆ వెంటనే 12 పరుగులు చేసిన దర్శన్ నల్కండే వికెట్ కోల్పోయింది గుజరాత్. దీంతో 80 పరుగుల వద్ద టైటాన్స్ 5వ వికెట్ కోల్పోయింది.

తరువాత 17 పరుగులు చేసిన విజయ్ శంకర్ ఆరో వికెట్ రూపంలో అవుట్ అయ్యాడు. అదే ఓవర్లో రషీద్ ఖాన్ డకౌట్ అయ్యాడు. 2 పరుగులు చేసిన ఉమేశ్ యాదవ్ నవీన్ ఉల్ హక్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. దీంతో 102 పరుగుల వద్ద గుజరాత్ 8వ వికెట్ కోల్పోయింది. 19వ ఓవర్లో 30 పరుగులు చేసిన రాహుల్ తెవాతియా యశ్ ఠాకూర్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఆ తరువాత నూర్ యశ్ ఠాకూర్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. దీంతో లక్నో 33 పరుగులతో విజయం సాధించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement