Friday, April 26, 2024

లైవ్ రిపోర్టింగ్ లో కుక్క హల్ చల్

లైవ్ రిపోర్టింగ్ అన్నది జర్నలిస్టులకు కత్తి మీద సాము వంటిది. అదే లైవ్ రిపోర్టింగ్ బయట చేయాల్సి వస్తే ఇక చెప్పేదే ముంది అక్కడ అకస్మాత్తుగా చాలా జరుగుతుంటాయి. అయితే, కొన్ని సార్లు ఆ సంఘటనల వల్ల లైవ్ రిపోర్టింగ్ కాస్త కామెడీగా మారిపోతుంది. తాజాగా ఓ యువతి లైవ్ రిపోర్టింగ్ చేస్తుండగా ఓ కుక్క పిల్ల హల్ చల్ చేసింది. అకస్మాతుగా వచ్చి రిపోర్ట్ మైక్రోఫోన్ ను లాగేసి.. పారిపోయింది. దీంతో జర్నలిస్టుతో సహా, స్టూడియోలో ఉన్న యాంకర్ అవాక్కైంది. దీంతో అక్కడ కొద్ది సేపు నవ్వులు విరిశాయి. ఈ ఘటన రష్యాలో జరిగింది. ఇందుకు సంబందింని వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement