Friday, May 3, 2024

నెర‌వేరిన ‘గంగ‌వ్వ’ క‌ల‌..కొత్త ఇంటిలోకి గృహ‌ప్ర‌వేశం..

ఎట్ట‌కేల‌కు గంగ‌వ్వ త‌న క‌ల‌ని నెర‌వేర్చుకుంది. టాలీవుడ్ హీరో నాగార్జున స‌హాయంతో త‌న సొంతింటి క‌ల‌ని నెర‌వేర్చుకుంది. బిగ్‌ బాస్‌ తెలుగు 4వ సీజన్‌ లో కంటెస్టెంట్‌ గా ఇంట్లో అడుగుపెట్టిన గంగవ్వ.. మద్యలోనే.. బయటకు వచ్చేసింది. అనారోగ్య సమస్య కారణంగా బిగ్‌ బాస్‌ హౌజ్‌ నుంచి వచ్చేసింది. ఈ సందర్భంగా తన చిరకాల కోరికను హోస్ట్‌ నాగార్జున ముందు పెట్టింది. దీంతో నాగార్జున బిగ్‌ బాస్‌ నుంచి… గంగవ్వ ఇంటి కోసం ఏకంగా రూ.11 లక్షలు ఇప్పించాడు. ఆ డబ్బుతో తన ఇళ్లు పూర్తి చేసుకుంది. తాజాగా కొత్త ఇంట్లో గంగవ్వ గృహ ప్రవేశం చేయగా.. ఈ కార్యక్రమానికి బిగ్‌ బాస్‌ నాలుగో సీజన్‌ కంటెస్టెంట్లు కూడా వచ్చారు. ఇక తన ఇంటి నిర్మాణం కోసం సహాయం చేసిన నాగార్జునకు కృతజ్ఞతలు చెప్పింది గంగవ్వ.జగిత్యాల జిల్లా మల్యాల మండలం లంబాడి పల్లిలో నూతనంగా నిర్మించుకున్న ఇంట్లోకి గంగవ్వ గృహ ప్రవేశం చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement