Sunday, May 19, 2024

పంజాబ్‌లో గాంధీ విగ్రహం ధ్వంసం.. తలను ఎత్తుకెళ్లి మొండెం తునాతునకలు

దేశానికి స్వాతంత్యం తీసుకువచ్చిన కీలకమైన నేతల్లో ఒకరైన మహాత్మా గాంధీకి ఘోర పరాభవం జరిగింది. ఆయన విగ్రహాన్ని పం జాబ్‌లో గుర్తుతెలియని వ్యక్తులు కొందరు నేల కూల్చారు. అంతే కాదు మహాత్మాగాంధీ తలను ఎత్తుకెళ్లి మొండాన్ని తునాతునకలు చేశారు. పంజాబ్‌లోని భటిండాలో మహాత్మాగాంధీ విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారని పోలీసులు శనివారం తెలిపారు. గురు, శుక్రవారాల మధ్య రాత్రి ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.

గాంధీ విగ్రహం రమ్మన్‌ మండీలోని పబ్లిక్‌ పార్క్‌ వద్ద ఉంది. విగ్రహాన్ని ధ్వంసం చేసిన తర్వాత గుర్తు తెలియని దుండగులు పారిపోయారు. రమ్మన్‌ మండి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజిని పరిశీలిస్తున్నామని త్వరలో అరెస్ట్‌ చేస్తామని స్టేషన్‌ హౌజ్‌ ఆఫిసర్‌ హర్జోత్‌ సింగ్‌ మాన్‌ తెలిపారు. ఈ విధ్వంసాన్ని స్థానికులు తీవ్రంగా ఖండిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement