Sunday, September 24, 2023

స్టార్టప్‌లకు ఫండింగ్‌ కష్టాలు?

సీడ్‌ ఫండింగ్‌ను ఆకర్షించే మూడు స్టార్టప్‌లలో ఒకటి కంటే తక్కువ సంస్థలే ‘సిరీస్‌ ఎ’ రౌండ్‌ రూపంలో ఫాలో-ఆన్‌ ఫండింగ్‌ను సమీకరించ గలుగుతున్నాయని వెంచర్‌ ఇంటెలిజెన్స్‌ అధ్యయనం పేర్కొంది. 2015-2022 మధ్య సీడ్‌ ఫండింగ్‌ని సేకరించిన 2,500 స్టార్టప్‌లలో, కేవలం 29 శాతం (అంటే, 734 కంపెనీలు) మాత్రమే సిరీస్‌ ఎ రౌండ్‌ను (సాధారణంగా సంస్థాగత వెంచర్‌ క్యాపిటల్‌ ఫండింగ్‌ మొదటి రౌండ్‌) సమీకరించగలిగాయని అధ్యయనం తేల్చింది. అయితే, స్టార్టప్‌ ఒకసారి సిరీస్‌ ఎ రౌండ్‌ను ఆకర్షిస్తే, తదుపరి రౌండ్ల మూలధనాన్ని పెంచడంలో దాని విజయ నిష్పత్తి గణనీయంగా మెరుగుపడుతుంది. ఉదాహరణకు, అధ్యయన కాలంలో సిరీస్‌ ఎ ని పెంచిన 50 శాతం కంపెనీలు సిరీస్‌ బి రౌండ్‌లో విజయం సాధించాయి.

- Advertisement -
   

సిరీస్‌ సి రౌండ్‌ను ఆకర్షించిన స్టార్టప్‌లలో 62 శాతం మంది సిరీస్‌ డి రౌండ్‌ను పొందడంలో విజయం సాధించారు. సీరీస్‌ సి ఫండెడ్‌ కంపెనీలలో, 70 శాతం సీరీస్‌ డి అంతకు మించిన రౌండ్‌లను చేరుకోగలిగాయని అధ్యయనం కనుగొంది. 2017-2022 వరకు ఐదేళ్ల కాలంలో సిరీస్‌ ఎ రౌండ్‌ కంపెనీల పెరుగుదల కేవలం 8 శాతమేనని సిఎజిఆర్‌ డేటా వెల్లడించింది. 2022లో నిధుల మందగమనం ప్రారంభమైనప్పటికీ, ఆ సంవత్సరంలో సిరీస్‌ ఎ పెట్టుబడుల సంఖ్య (289) 2021తో పోలిస్తే 7 శాతంగా నమోదైంది. ఇటీవలి ఏడేళ్లలో నమోదైన 224 డీల్‌ల సగటు కంటే 30 శాతం ఎక్కువ.

Advertisement

తాజా వార్తలు

Advertisement