Friday, March 29, 2024

Bridge Collapses | నిర్మాణంలో ఉండగానే కుప్పకూలిన బ్రిడ్జి.. బీహార్​లో ఘటన

బీహార్​ రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ఓ భారీ వంతెన కుప్పకూలింది. ఈ ఘటనలో పదుల సంఖ్యలో ప్రజలు చనిపోయి ఉంటారని తెలుస్తోంది. కాగా, దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అయితే.. ఈ బ్రిడ్జి ఇంతకు ముందు కూడా ఇట్లనే కూలిపోయినట్టు తెలుస్తోంది. నిర్మాణంలో లోపం, నాసిరకం మెటీరియల్​ వాడడం వల్లనే ఈప్రమాదం జరిగినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

బీహార్​ రాష్ట్రం భాగల్‌పూర్ జిల్లాలోని సుల్తాన్‌గంజ్ మధ్య గంగా నదిపై నిర్మాణంలో ఉన్న నాలుగు లేన్ల వంతెన ఇవ్వాల (ఆదివారం) కూలిపోయింది. ఈ విషయాన్ని అక్కడి అధికారులు తెలిపారు. కాగా, ఈ బ్రిడ్జిపై చాలా మంది కార్మికులు పనిచేస్తున్నారని, వారిలో ఎంతమంది చనిపోయారు.. ఎంతమంది బతికి ఉన్నారనే దానిపై క్లారిటీ లేదు. వారిలో చాలా మంది చనిపోయినట్టు తెలుస్తోంది. అయితే.. భాగల్‌పూర్ జిల్లా యంత్రాంగం కానీ, బీహార్ ప్రభుత్వం కానీ, ప్రాణనష్టంపై ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. సమాచారం అందుకున్న జిల్లా అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

సుల్తాన్‌గంజ్‌-ఖగారియా మధ్య ఉన్న ఈ వంతెన గతేడాది కూడా కూలిపోయింది. ఆ సమయంలో ఈదురు గాలులు వీయడంతో వంతెన కూలిపోయిందని అధికారులు తెలిపారు. నిర్మాణ సంస్థ ‘ఎస్‌కే సింగ్లా’పై చర్యలు తీసుకుంటామని బీహార్ ప్రభుత్వం తెలిపింది. విచారణ తర్వాత కంపెనీకి క్లీన్-చిట్ ఇచ్చారు. ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి కూడా కొంత వెసులుబాటుతో సమయం ఇచ్చినట్టు తెలుస్తోంది.

- Advertisement -

ఇక.. ఈ వంతెన నిర్మాణం 2014లో ప్రారంభమైంది. ఇది గతంలో ఆరు సార్లు నిర్మాణ గడువులను కోల్పోయింది. జూన్ 30వ తేదీ వరకు దీని నిర్మాణానికి గడువు ఉండగా.. ఇప్పుడు ఆ వంతెన కూలిపోవడం విశేషం. ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. ప్రాజెక్ట్ పూర్తి తేదీ 2019 మార్చి వరకు ఉండగా.. సకాలంలో పూర్తి కాకపోవడంతో బీహార్ ప్రభుత్వం 2022 జూన్​ వరకు గడువును పొడిగించింది. అది మరోసారి గడువు కావాలని కోరడంతో ఈఏడాది జూన్​ 30వ తేదీకి పొడిగించినట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement