Saturday, September 28, 2024

చైనాలో ఘోరం.. కొండచరియలు విరిగిపడి 19 మంది మృతి

చైనాలోని నైరుతి సిచువాన్ ప్రావిన్స్‌లో ఘోరం జరిగింది. ఓ గనిలో ఇవ్వాల (ఆదివారం) కొండచరియలు విరిగిపడి 19 మంది చనిపోయారు. ఈ విషయాన్ని చైనా ప్రభుత్వ మీడియా సంస్థ సీసీటీవీ తెలిపింది. ప్రావిన్స్‌లోని దక్షిణాన లెషాన్ సిటీకి దగ్గర్లోని పర్వత ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది.

పర్వతప్రాంతం స్థానిక మైనింగ్ కంపెనీ ఉత్పత్తి, లివింగ్‌ ఫెసిలిటీపై కూలినట్లు సమాచారం అందుతోంది. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే రెస్క్యూ సిబ్బంది రంగంలోకి దిగారు. కొండచరియలు విరిగిపడటానికి గల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు జరుగుతోందని సీసీటీవీ పేర్కొంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement