Saturday, April 27, 2024

యూత్‌ వరల్డ్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు మరో నాలుగు మెడల్స్‌.. మొత్తంగా 11కు చేరిన పతకాల సంఖ్య

ఐబీఏ యూత్‌ మెన్స్‌ అండ్‌ ఉమెన్స్‌ వరల్డ్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్స్‌లో భారత బాక్సర్లు సత్తాచాటుతున్నారు. ఇవ్వాల (బుధవారం) జరిగిన క్వార్టర్‌ ఫైనల్స్‌లో మరో నలుగురు బాక్సర్లు రాణించి పతకాలు ఖాయం చేశారు. ఇందులో ముస్కన్‌, తమన్నా సెమీఫైనల్‌కు చేరుకున్నారు. యూత్‌ ఏసియన్‌ చాంపియన్‌షిప్స్‌ సిల్వర్‌ మెడలిస్ట్‌ కీర్తి (81కేజీల విభాగం), దేవిక గోర్పడే (52 కేజీల విభాగం)తో పాటు మరో ఇద్దరు బాక్సర్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. వరుసగా నాలుగు స్టేజీల్లో విజయాలు అందుకుని, ముందుకు సాగుతున్నారు.

ఉమెన్స్‌ 50కేజీల క్వార్టర్‌-ఫైనల్‌ విభాగంలో తమన్నా తన ప్రత్యర్థి జపాన్‌ క్రీడాకారిణి జుని టొనిగవపై పూర్తి ఆధిపత్యం చెలాయించి, సెమీఫైనల్‌కు చేరుకుంది. దేవిక కూడా ప్రత్యర్థి జర్మనీకి చెందిన అస్య అరిపై 5-0తో విజయం సాధించి, సెమీస్‌కు చేరింది. ముస్కర్‌- కీర్తి ఇద్దరూ తమ ప్రత్యర్థులు మంగోలియాకు చెందిన జియిన్‌యెప్‌ అజిమ్‌బాయ్‌- లివియా బొటికా (రొమేనియా)లపై మూడున్నర నిముషాల్లోనే పైచేయి సాధించి, సెమీస్‌కు చేరారు. ఇక ప్రీతి దహియా (57కేజీలు), రిథమ్‌ (92 కేజీలు), జాడుమని సింగ్‌ మండీన్‌బమ్‌ (51కేజీలు) క్వార్టర్‌ ఫైనల్‌లో ఓటమిని చవిచూసి టోర్నీ నుంచి నిష్క్రమించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement