Sunday, May 5, 2024

మన ఊరు మన బడి పనులకు శంకుస్థాపన-మంత్రి సబితారెడ్డి చేతుల మీదుగా ప్రారంభం

షాద్ నగర్ నియోజకవర్గం కొత్తూర్ మున్సిపాలిటీ పరిధిలోని తిమ్మాపూర్ .. కొత్తూరు ప్రభుత్వ పాఠశాలలో మన ఊరు – మన బడి,మన బస్తీ మన బడి కార్యక్రమంలో మంజూరైన పనులకు శంకుస్థాపన చేశారు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.
స్థానిక ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాలలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ…
ఒక యజ్ఞం లాగా ముఖ్యమంత్రి కేసీఆర్ మన ఊరు- మన బడి,మన బస్తీ-మన బడి కి శ్రీకారం చుట్టారని కొనియాడారు.
రూ.7289 కోట్ల భారీ బడ్జెట్ తో 26 వేల పాఠశాలల్లో 12రకాలపనులు చేపడుతున్నామన్నారు.

చాలా వరకు ప్రయివేటు పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ఉండటంతో తల్లిదండ్రులు మొగ్గు చూపుతుండటంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ పాఠశాలల్లో ఈ సంవత్సరం నుండి ఆంగ్ల బోధన కు ఆదేశాలు ఇచ్చారనీ తెలిపారు.మన విద్యార్థులు ప్రపంచముతో పోటీ పడేలా తెలంగాణ విద్యార్థి ఎక్కడకు వెళ్లిన రాణించేలా తయారు కావాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ అభిమతమని సబితారెడ్డి పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ అనిత రెడ్డి గారు,వైస్ చైర్మన్ గణేష్ గారు,మునిసిపల్ చైర్మన్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement