Sunday, April 28, 2024

కాంగ్రెస్ కు సుస్మితా దేవ్ రాజీనామా

త్వరలో ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్న వేళ.. కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. మాజీ ఎంపీ సుస్మితా దేవ్ కాంగ్రెస్ పార్టీని వీడారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన సుస్మితా దేవ్‌ త్వరలోనే తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో సుస్మితా దేవ్‌ సోమవారం పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆమె మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీతో భేటీ అవ్వనున్నట్లు తెలుస్తోంది.

సుస్మితా దేవ్ 2014 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై అసోంలోని సిల్చార్ స్థానం నుంచి పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. తర్వాత ఆమెకు పార్టీ అధిష్ఠానం ఆల్‌ ఇండియా మహిళా కాంగ్రెస్‌ బాధ్యతలు సైతం అప్పగించింది. అసోం అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల పంపకంపై అసంతృప్తిగా ఉన్న సుస్మితా దేవ్‌ పార్టీని వీడతారంటూ వచ్చిన వార్తలను కాంగ్రెస్‌ ఖండించింది. అయితే, అసోం అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత సుస్మితా దేవ్ రాజీనామా చేయడం ప్రాధాన్యత ఏర్పడింది. రాజీనామాకు ముందు ఆమె వాట్సాప్‌ గ్రూప్‌ల నుంచి వైదొలిగారు.

ఇది కూడా చదవండి: కోట్లు విలువైన 11 లగ్జరీ కార్లు సీజ్

Advertisement

తాజా వార్తలు

Advertisement