Monday, April 29, 2024

భీమ్లా నాయక్…స్పీడ్ మాములుగా లేదు

పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ ఫస్ట్ గ్లింప్స్ సోషల్ మీడియాలో దుమ్ము దులుపుతున్న సంగతి తెలిసిందే. రికార్డు స్థాయిలో వ్యూస్ ను రాబెడుతుంది. గడచిన 24 గంటల్లో 10 మిలియన్ల ప్లస్ వ్యూస్ అలాగే 700కే ప్లస్ లైక్స్ సాధించింది. తక్కువ సమయంలో దేశంలోనే అత్యధిక వ్యూస్ పొందిన వీడియో గా భీమ్లా నాయక్ గ్లింప్స్ రికార్డ్ క్రియేట్ చేసింది.

మలయాళంలో సూపర్ హిట్ సాధించిన అయ్యప్పనుమ్ కొషియమ్ సినిమాకు రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఇక ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సాగర్ కే చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిత్యమీనన్ పవన్ సరసన నటిస్తుంది. అలాగే రానా సరసన ఐశ్వర్య రాజేష్ నటించనుంది. మరోవైపు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు అందించారు. అలాగే త్వరలో రానాకు సంబంధించిన స్పెషల్ వీడియోను చిత్ర యూనిట్ రిలీజ్ చేయనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement